Wednesday, July 17, 2019

వియన్నా ఒప్పందం ఉల్లంఘించిన పాక్: ఐసీజే మందలింపు

వియన్నా ఒప్పందం ఉల్లంఘించిన పాక్: ఐసీజే మందలింపు
17-07-2019 19:05:23

హేగ్: కులభూషణ్ జాదవ్‌కు కేసులో భారత్‌కు భారీ ఊరట లభించింది. భారత నేవీ రిటైర్డ్ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాక్ మిలటరీ కోర్టు విధించిన ‌ఉరిశిక్షను పునఃసమీక్షించాలని అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడాన్ని నిలదీసింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలంటూ భారత్ చేసిన వాదన సరైనదేనంటూ సమర్ధించింది. జాదవ్‌కు న్యాయసహాయం అందకుండా చేయడం వియన్నా ఒప్పందం ఉల్లంఘన కిందకే వస్తుందని ఐసీజే పేర్కొన్నట్టు ఐసీజే అంతర్జాతీయ న్యాయ సలహాదారు రీమా ఒమెర్ ఒక ట్వీట్‌లో తెలిపారు. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని పాక్‌కు ఐసీజే స్పష్టం చేసిందన్నారు.

కాగా, జాదవ్‌కు మిలటరీ కోర్టు విధించిన శిక్ష చెల్లకుండా చేయడంతో పాటు, ఆయనను విడుదల చేసి, ఇండియాకు సురక్షితంగా పంపించాలంటూ భారత్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చినట్టు రీమా ఒమెర్ తెలిపారు. 2016 మార్చి 3న పాక్ సైన్యం 49 ఏళ్ల జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రాంతంలో పట్టుకుంది, గూఢచర్యం, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును భారత్ ఐసీజేలో సవాలు చేసింది.


కుల్‌భూషణ్‌కు న్యాయం జరుగుతుంది: ప్రధాని మోదీ
17-07-2019 21:52:28

న్యూఢిల్లీ: పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వాస్తవాల ఆధారంగా తీర్పు వెలువడిందన్నారు. కుల్‌భూషణ్‌కు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భారతీయుడి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని మోదీ ట్వీట్ చేశారు.

జాదవ్ కేసులో ఐసీజే తీర్పుపై ఎవరేమన్నారంటే...
17-07-2019 20:42:18

న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై స్టే ఇవ్వడం, భారత రాయబార కార్యాలయం అధికారులను కలుసుకునేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించడంపై భారత్‌లో సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తదితరులు ఐసీజే తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీర్పును శ్లాఘించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


నిస్సందేహంగా ఇది భారత్‌ సాధించిన ఘనవిజయమని రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే అభిప్రాయన్ని సుష్మాస్వరాజ్ వ్యక్తం చేశారు. జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లిన ప్రధాని మోదీకి, వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 'న్యాయం' అనే పదానికి నిజమైన అర్ధం ఐసీజే తీర్పు అని చిదంబరం అభివర్ణించారు. కేసుకు అనుకూలంగా 15 మంది జడ్జీలు, వ్యతిరేకంగా 1 జడ్జీ తీర్పు ఇవ్వడం అంటే ఏకగ్రీవంగా తీర్పువచ్చినట్టేనని ఆయన అన్నారు. జాదవ్‌కు విధించిన శిక్షపై స్టే ఇవ్వడాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. సత్యం, న్యాయం గెలిచిందని, త్వరలోనే మన భరతమాత పుత్రుడు స్వదేశానికి తిరిగి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గొప్ప దౌత్య విజయం: గడ్కరి
ఇండియాకు ఇది అతి పెద్ద దౌత్య విజయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ఈ కేసులో అవిశ్రాంతంగా పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వేలను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా జాదవ్ అమాయకత్వాన్ని వారు నిరూపించారని, భరతమాత ముద్దుబిడ్డడు (జాదవ్) త్వరలోనే ఇండియా తిరిగి వస్తారని మనమంతా ఆశిద్దామని అన్నారు.

జాదవ్ మిత్రులు సంబరాలు
కాగా, జాదవ్‌కు విధించిన శిక్షపై స్టే ఇస్తూ, శిక్షను పునఃపరిశీలించాలంటూ పాక్‌ ప్రభుత్వాన్ని ఐసీజే ఆదేశించడంతో ముంబైలోని జాదవ్ మిత్రులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుంటూ, గాలిలోకి బెలూన్లు వదులుతూ తమ ఆనందాన్ని పంకున్నారు. ఐసీజే తీర్పుతో జాదవ్ అమాయకత్వం నిరూపితమైందని, త్వరలోనే మాతృభూమికి జాదవ్ తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉన్నామని వారు తెలిపారు.

భారత్‌కు ఇది గొప్ప విజయం: సుష్మాస్వరాజ్‌
17-07-2019 19:15:31

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఐసీజే తీర్పుపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ భారత్‌కు ఇది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. జాదవ్‌ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జాదవ్‌‌కు పాక్‌ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ.. ఆ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని ఐసీజే తీర్పులో స్పష్టం చేసింది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment