Friday, August 16, 2019

భారత్‌ ‘అణు’ హెచ్చరిక!

భారత్‌ ‘అణు’ హెచ్చరిక!
17-08-2019 00:53:11

‘తొలిగా అణ్వస్త్రం వాడబోం’ అనే మా సిద్ధాంతం మారొచ్చు
ఇకపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం
వాజపేయి వర్ధంతి రోజు పోఖ్రాన్‌లో బాంబు పేల్చిన రాజ్‌నాథ్‌
20 ఏళ్ల తర్వాత మారిన వైఖరి.. పాక్‌ యుద్ధోన్మాదానికి చెక్‌!
పోఖ్రాన్‌, ఆగస్టు 16: పాకిస్థాన్‌కు భారత్‌ శుక్రవారంనాడు ఓ గట్టి షాక్‌ ఇచ్చింది. అణ్వస్త్రాలను మొదట ప్రయోగించబోమని ఇన్నాళ్లుగా తాము అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని అవసరమైతే పక్కన పెడతామని దాదాపుగా తేల్చి చెప్పేసింది. ‘‘ఈ విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ప్రకటనను కూడా ...భారత్‌ రెండు సార్లు అణుపరీక్షలు జరిపిన పోఖ్రాన్‌లో ఆయన చేయడం విశేషం. అది కూడా మాజీ ప్రధాని, ఈ సిద్ధాంత రూపకర్త అటల్‌ బిహారీ వాజ్‌పేయి తొలి వర్ధంతి నాడు చేయడం మరో ఆసక్తికర అంశం. ‘‘దేశాన్ని అణ్వస్త్ర శక్తిగా తీర్చిదిద్దాలన్నది అటల్‌ జీ స్వప్నం. అది నెరవేరింది. అయితే ఆ విధానం మాత్రం పరిస్థితులను బట్టే ఉంటుంది’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పోఖ్రాన్‌లో ఆర్మీ స్కౌట్స్‌ పోటీల ముగింపు సమావేశానంతరం -ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సమక్షంలో ఆయన మీడియాతో ఈ మాటన్నారు. ఇదే విషయాన్ని ట్వీట్‌ ద్వారా కూడా తెలియజేశారు. కశ్మీర్లో ఆర్టికల్‌ 370 నిర్వీర్యం, రాష్ట్ర విభజన అంశాలపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మరికొద్ది గంటలో చర్చించనున్న సమయంలో రాజ్‌నాథ్‌ ప్రకటన వెలువడింది. తమది అణ్వస్త్ర దేశమని, ఎంతకైనా తెగబడతామని పాకిస్థాన్‌ రెచ్చిపోతున్న తరుణంలో భారత్‌ చేసిన హెచ్చరిక ఇది. ఒక్క పాక్‌కే కాకుండా ప్రపంచదేశాలకు కూడా భారత్‌ తన సత్తాను పరోక్షంగా తెలియపర్చిందని నిపుణులు అంటున్నారు. రెండోసారి అధికారంలోకొచ్చాక దూకుడుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం తాజాగా ‘అణు హెచ్చరిక’ చేయడం మారుతున్న ప్రభుత్వ వైఖరికి సంకేతమని చెబుతున్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సరిగ్గా 20 ఏళ్ల తరువాత..
ఏ దేశంతోనైనా యుద్ధం వచ్చినపుడు అణ్వస్త్రాలను తాము మొదట ప్రయోగించబోమన్నది భారత్‌ ప్రవచిత విధానం. 1998లో రెండోసారి పోఖ్రాన్‌ అణు పరీక్ష జరిపాక -1999 ఆగస్టులో నాటి ప్రధాని వాజ్‌పేయి స్వయంగా ఈ ప్రకటన చేశారు. 2016 నవంబరులో నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌ కూడా - భారత్‌ ఈ సిద్ధాంతానికి ఎందుకు కట్టుబడి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత అణ్వస్త్ర విధానాన్ని సవరించి అప్‌డేట్‌ చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే బీజేపీ ప్రకటించింది.

No comments:

Post a Comment